Sidebar


Welcome to Vizag Express
జ్ఞాపకాల పందిరిలో-18 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

16-01-2025 22:25:24

జ్ఞాపకాల పందిరిలో-18 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్ధుల సమ్మేళనం    
                             లావేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16:

 మండలంలో అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2006-2007 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు,నాటి ఉపాధ్యాయులు గురువారం చదువులమ్మగుడిలో కలుసుకున్నారు.18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలో కలుసుకోవడంతో  వారు పొందిన ఆనందం,అనుభూతి కట్టలు తెంచుకుంది.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలోని పాటను హాయిగా పాడుకున్నారు.కుశలమా!అంటూ పరస్పరం పలకరించుకున్నారు.ఆనాటి అనుభవాలను, అనుబంధాలను వేదికపై ఎక్కి పలువురు విద్యార్థులు మాట్లాడారు.తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన అక్షరబ్రహ్మలను ఘనంగా సత్కరించారు.ఈ అనుబంధం ఇలానే కొనసాగాలని,అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు తమ శిష్యులను ఆశీర్వాదించారు.