రణస్థలం మండలం కోస్టా పంచాయతీ సచివాలయం మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న బమ్మిడి అమ్మోజి ఐదో సారి జాతీయ పురస్కారం అందుకోనున్నారు.
16-01-2025 22:29:11
సిక్కోలు రచయిత్రికి జాతీయ పురస్కారం.
రణస్థలం వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 16
రణస్థలం మండలం కోస్టా పంచాయతీ సచివాలయం మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న బమ్మిడి అమ్మోజి ఐదో సారి జాతీయ పురస్కారం అందుకోనున్నారు. సమీక్షకురాలిగా, సామాజిక వేత్తగా గా రాణిస్తున్న యువ రచయిత్రి అమ్మోజీ బమ్మిడి తెలుగు తేజం పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రైటర్స్ ఫోరం, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా అందిస్తున్న ఈ పురస్కారానికి ఎంపికైనట్లుగా ఆహ్వాన పత్రాన్ని సంస్థల అధ్యక్షులు సి.కె.వి.రావు, కె.రాఘవేంద్రరావు గురువారం అమ్మోజి కి అందజేశారు. అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక లో కీలకమైన మీడియా ప్రతినిధి బాధ్యత నిర్వర్తిస్తూ తాను చేస్తున్న సాహిత్య కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఎంపిక చేశామని వారు తెలిపారు. ఈ అవార్డును జనవరి 21 మంగళవారం విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకోనున్నట్టు అమ్మోజీ తెలిపారు. అమ్ము కలం పేరుతో రచనలు చేస్తున్న ఆమె గతంలో తెలుగు తేజం, సేవా రత్న, శ్రీ శ్రీ ప్రతిభ పురస్కారం, విశ్వభారత్ వీర పురస్కారం, తదితర అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు మూడు వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అమ్మోజి ఒక అనాధ శరణాలయంలోని ముగ్గురు అమ్మాయిలను ఆమె దత్తత తీసుకొని ఏడేళ్లుగా వారి యోగక్షేమాలు చూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ పురస్కారం పారితోషికాన్ని ట్రస్ట్ పిల్లలకి అప్పగిస్తానని అమ్మోజీ తెలిపారు. ఇంతటి విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినందుకు సంస్థల ప్రతినిధులకు, శ్రీశ్రీ కళావేదికలో సముచిత స్థానం కల్పించిన చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కు, కన్వీనర్ కొల్లి రమావతి కి అమ్మోజీ ధన్యవాదాలు తెలిపారు.