సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ వీజీకే మూర్తి మృతి కార్మిక, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
రంగస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 16
.1997లో పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో శ్యాంక్రగ్ పిస్టన్స్&రింగ్స్ లిమిటెడ్ పరిశ్రమలో సీఐటీయూ అనుబంధ యూనియన్ ఏర్పాటు చేయడానికి, తరువాత 8నెలలు పాటు కార్మికులతో సుదీర్ఘ సమ్మె నడిపించడంలో మూర్తి గారి కృషి ఎనలేనిది. 1998లో అప్పటి కలెక్టర్ ఎస్.ఈ శేఖరబాబుకు కార్మికులు పడుతున్న ఇబ్బందులు, సమస్య వివరించి వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరానికి చేసిన కృషి కార్మికుల గుండెల్లో ఇప్పటికీ మరిచిపోలేని విషయం. నేను ట్రేడ్ యూనియన్ నాయకుడు గా అభివృద్ధి కావడానికి, పూర్తికాలం కార్యకర్తగా రావడానికి కామ్రేడ్ వీజీకే మూర్తి కారణం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పోరాటాలకు నాకు ఆయనే స్ఫూర్తి పి.తేజేశ్వరరావు
సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి