శ్రీశ్రీశ్రీ సౌ గురమ్మ పేరంటాలు వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.
రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 16
లావేరు మండలం గుర్రాల పాలెం లో ప్రతి ఏటా జరిగే శ్రీశ్రీశ్రీ సౌ గురమ్మ పేరంటాలు 55వ వార్షికోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర రావు తో పాటు, భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అనంతరం ఎంపీ మాట్లాడుతూ శ్రీ గురమ్మ పేరంటాలు అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపినారు. అలాగే ఈ మహోత్సవాల్లో లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పుడి సురేష్ , ఎక్స . ఎంపీపీ మీసాల వెంకటరమణ , రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్ గారు తదితర ముఖ్య కూటమి నాయకులు పాల్గొన్నారు.