కాంగ్రెస్ హయాంలోని ఇచ్చాపురం అభివృద్ధి!
ఎమ్మెల్సీ నర్తు ,రామారావు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ జనవరి 16:
తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం కంచుకోటని చెప్పుకుంటున్న ఆ పార్టీ నాయకులు ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యమని ,ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి అంతా దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి ,ఆయన కుమారుడు జగన్ మోహనరెడ్డి హయాంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని శాసనమండలి సభ్యులు నర్తు రామారావు అన్నారు. గురువారం ఆయన స్వగృహంలో కొత్త పుట్టుగలో వైజాగ్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడారు. ఇచ్చాపురం నియోజవర్గంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదని ఈ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సరైన రవాణా సదుపాయాలు లేక నియోజకవర్గం కళింగపట్నం, బొడ్డువాడ,ఈదుపురం ప్రాంతాలకు చెందిన ప్రజలకు వంతెనలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో లేనని అన్నారు. కిడ్నీ సమస్యలుతో తీవ్ర ఇబ్బందులు పడుతూ మృత్యువాతపడుతున్న ప్రజల్ని చూసి చలించిపోయిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు వ్యయంతో స్వచ్ఛమైన తాగునీరు, 74 కోట్లతో కాశీబుగ్గలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారని గుర్తు చేశారు. ఈ సమస్య అనేక దశాబ్దాలుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు కిడ్నీ బాధితులు చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు నియోజకవర్గ సమస్యలను గత ముఖ్యమంత్రులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలగాలని అందుకు తగిన విధంగా పార్టీ కూడా తనను గుర్తించి శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు అప్పగించిందని ఆనందం వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకులు దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కూటమి పర్వతం ఏర్పడి 8 నెలలకు అయిన్నప్పటికీ నేటికీ అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం మీనమేసాలు లెక్కిస్తుందని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో ఆట్లాడుకుంటుందని ధ్వజమెత్తారు. ఉన్నత చదువులు చదివినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరని ,వారు ఆలోచనలు ఉన్నతంగా ఉండి ప్రజల కోసం పనిచేసినప్పుడే వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మంచి మనసు ఉండాలి గాని ఉన్నతమైన చదువుతో పని ఏముందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా తాను నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ వారు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని, ఈ నేపథ్యంలో పార్టీ తనను గుర్తించిందని పేర్కొన్నారు. ఇచ్చాపురం నియోజవర్గం నుంచి గతంలో తాను పోటీ చేసిన రెండుసార్లు ఓటమి పాలవ్వడానికి పార్టీలో ఉన్న విభేదాలె కారణమని, ప్రజలంతా పార్టీ వైపు ఉన్నప్పటికీ నాయకుల్లో కొంతమంది వ్యక్తిగత స్వార్థానికి పార్టీని బలి చేసారని ఆరోపించారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రస్తుతం ఏలుతున్న కూటమి పాలనకు భారీ వ్యత్యాసం కనిపిస్తుందని, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు పాలన కొనసాగుతుందని విమర్శించారు.