Sidebar


Welcome to Vizag Express
రోడ్డు ప్రమాదంలో పలాస వాసి మృతి.!

16-01-2025 22:37:39

,రోడ్డు ప్రమాదంలో పలాస వాసి మృతి.!

మరొకరికి తీవ్ర గాయాలు 


 సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 16:

పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలాస కేటి రోడ్డు  జీడి పిక్కల జంక్షన్ వద్ద సంభవించిన రోడ్డు  ప్రమాదం లో ఒకరు మృతి,చెందగా , మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ పోలీసులు కథనం  మేరకు ఎదురెదురుగా వస్తున్నరెండు బైకులు  ఢీకొన్న సంఘటనలో పలాస కు చెందిన లక్కోజు  కనకరాజు తీవ్రగాయాలతో శ్రీకాకుళం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.ఇదే సంఘటన లో  
 సింహాద్రి సీతారాం అనే వ్యక్తి గాయాలతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.