ఘనంగా సంక్రాంతి సంబరాలు
16-01-2025 22:45:49
ఘనంగా సంక్రాంతి సంబరాలు
ముంచంగిపుట్టు వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,16: మండలంలో ఏనుగురాయి పంచాయతీ నడుమూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామంలో స్టార్ యూత్ స్థాపించిన 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గ్రామంలో సంతోషానికి అవధులు లేవు. గ్రామంలో యువతి, యువకులు, ఉద్యోగులు, చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేశారు. గ్రామంలో బుధవారం రాత్రి స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మూర్తి దంపతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో గత పది రోజులుగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్, ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర మాట్లాడుతూ గ్రామంలో స్టార్ యూత్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు స్టార్ యూత్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, చైతన్య పరిచి ఉద్యోగ, ఉపాధి పొందడానికి కృషి చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి ఉద్యోగంలో చేరిన వారు సహకరించడం గ్రామంలో ఐక్యమత్యానికి నిదర్శనమని ఆమె అభినందించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ, ద్వితీయ, స్థానంలో నిలిచిన జట్లు ముంచంగిపుట్టు పవర్ యూత్, గాదెలబూరుగు, వాలీబాల్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలిచిన మాలగుమ్మి, కోడపుట్టు, జట్ల ను చైర్ పర్సన్ సుభద్ర, స్థానిక సర్పంచ్, సిరగం నర్సింగరావు, ఎంపీటీసీ, మజ్జి సుబ్బలక్ష్మి ల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం యువతీ యువకులు దింసా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలను విజయవంతంగా ముందుకు నడిపారు. ఇంత గొప్పది కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ, గ్రామ ఉద్యోగులకు, స్టార్ యూత్, గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేత జెవివిఎన్ మూర్తి, పి పద్మారావు (లెక్చరర్), లతోపాటు స్థానికులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు