Sidebar


Welcome to Vizag Express
అడుగడుగునా గుంతలు

16-01-2025 22:51:18

అడుగడుగునా గుంతలు

తీవ్ర ఇబ్బందుల మద్య వాహన చోదకులు 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,16: మండలంలో కిలగాడ జంక్షన్ నుండి దారెల పంచాయతీ కేంద్రం పరిధి  పలు గ్రామాలను కలుపుతూ  గత 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ హయాంలో వేసిన తారు రోడ్డు శిధిల వ్యవస్థలో చేరి గుంతలు మయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతోనే రోడ్డు గుంతలుగా ఏర్పడి రాకపోకలు సాగించేందుకు వేరే గతిలేక చేసేదిలేక తీవ్ర ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొందని ఆ పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పెద్దలు సంక్రాంతి సెలవులకు రాకపోకలు సాగించే ప్రతి ఒక్క రహదారి అద్దం ల ఉండాలని గుంతలు లేని రోడ్లు రాష్ట్రంలో కనిపించాలని పత్రిక ప్రకటనలో గుప్పించారే  తప్ప రహదారి మరమ్మతులు వైపు కన్నెత్తి చూడలేదని ఆ పంచాయతీ ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కూటమీ ప్రభుత్వం స్పందించి కిలగాడ జంక్షన్ నుంచి దారెల పంచాయతీ కేంద్రం వరకు శిధిల వ్యవస్థలో చేరిన తారు రోడ్డు ను పూర్తిస్థాయిగా నూతన తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆ పంచాయతీ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు