Sidebar


Welcome to Vizag Express
మౌలిక సదుపాయాల కల్పన కు నిధులు కేటాయించాలి

16-01-2025 22:54:39

మౌలిక సదుపాయాల కల్పన కు నిధులు కేటాయించాలి

చైర్ పర్సన్ ను మర్యాదపూర్వకరంగా కలిసిన వైసిపి నేతలు

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,16: మండలంలో దారెల పంచాయితీ కేంద్రం పరిధి గ్రామాలలో త్రాగునీటి, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టేందుకు జెడ్పి నిధులు కేటాయించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కు స్థానిక వైసీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక విలాకర్లతో వారు మాట్లాడుతూ పంచాయితీ కేంద్రంలో విచ్చేసిన చైర్పర్సన్ సుభద్ర కు స్థానిక వైసీపీ నేతలు ధనుర్జాయ్, గౌరీ శంకర్, లతోపాటు పులిరాజు మర్యాదపూర్వకంగా ఆమెను కలిసామన్నారు. పంచాయతీ పరిధిలో గల ప్రధాన సమస్యలు సిసి రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యం, కల్పించాలని ఆమెను కోరమని తెలిపారు. వర్షాకాలంలో పలు గ్రామాలలో రోడ్డు సౌకర్యం లేక బురదలోనే రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొందని దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చైర్పర్సన్ సుభద్ర కు వివరించామని చెప్పారు. చైర్పర్సన్ పర్సన్ సుభద్ర  సానుకూలంగా స్పందించి త్రాగునీటి సౌకర్యం రోడ్డు డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, వైసిపి నేత జెవివిఎన్ మూర్తి, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి  స్థానిక వైసిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.