Sidebar


Welcome to Vizag Express
రివన్యూ ఆఫీసర్స్ క్యాలండర్ ఆవిష్కరణ

17-01-2025 19:03:43

రివన్యూ ఆఫీసర్స్ క్యాలండర్ ఆవిష్కరణ 

కె.కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్ ,జనవరి17: ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా కమిటీ 2025వ సంవత్సరం క్యాలెండర్లను  డైరీలను శుక్రవారం ఆవిష్కరించారు.  అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షుడు ఎస్.టి.రామకాసు ప్రధాన కార్యదర్శి  ఎన్.అనంతరామయ్య  జిల్లా ఉపాధ్యక్షుడు  పూడి సురేష్  అనకాపల్లి డివిజన్ అధ్యక్షుడు  గణేష్   కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన తహసీల్దార్  పి.భాగ్యవతి ని  అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమాల్లో  అసోసియేషన్  జిల్లా కోశాధికారి శ్రీ కె.గౌరీశంకర్ గారు, మండలంలోని విఆర్వోలు జ్యోతి, విజయశ్రీ, శివ, గంగునాయుడు, వెంకటేష్, నాయుడు, జగదీశ్, సూర్యనారాయణ  పాల్గొన్నారు.