Sidebar


Welcome to Vizag Express
సుభద్రపురం వెల్లే రోడ్డులో పతికాయవలస జంక్షన్ వద్ద ఆర్.&. బి సైట్ అక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు

17-01-2025 19:06:59

చీపురుపల్లి, ఎక్స్‌ప్రెస్ న్యూస్, జనవరి 16: చీపురుపల్లి నుండి సుభద్రపురం వెల్లే రోడ్డులో పతికాయవలస జంక్షన్ వద్ద ఆర్.&. బి సైట్ అక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలు పై మాజీ సర్పంచ్ పట్టా.యల్లయ్య  రేవెన్యు, మరియూ ఆర్&బి అధికారులకు పిర్యాదు చేసారు.అధికారులు వెంటనే స్పందించారు. దీంతో చీపురుపల్లి తహశీల్దార్ ఎన్.రాజారావు అక్రమ కట్టడాల ప్రాంతానికి వెళ్లి కట్టడాలను నిలిపేయాలని ఆదేశించారు. ఆయతే తహశీల్దారు వెళ్లిపోయిన  తర్వత అక్రమ వ్యక్తులు మళ్లీ పనులు ప్రారంభించారు. ఆయతే గ్రామస్తుల సమాచారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్&బి ఎ.ఇ. తో కలసి తహశీల్దారు అక్రమ కట్టడాలను పరిశీలించారు. కోలతలువేసి పూర్తి వివరాలు సేకరించారు. నిర్మాణాలు ఆర్‌అండ్‌బీ ప్రాంతంలోనే జరుగుతున్నాయని గుర్తుంచి తక్షణమే పనులు నిలిపేయాలని ఆదేశించారు.ఆదేశాలు ఖతరు చేయక పోతే చర్యలు తప్పవని హెచ్చరించా రు.