Sidebar


Welcome to Vizag Express
కుష్టు వ్యాధిపై సర్వే

17-01-2025 19:09:26

కుష్టు వ్యాధిపై సర్వే 
రేగిడి జనవరి 20 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్  
రేగిడి మండలం ప్రతి గ్రామంలో జనవరి 20 న తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం పై 14 రోజులు పాటు సర్వే జరుగుతుందని బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ ఎస్ చలమయ్య డాక్టర్ రీనా చౌదరిలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య కార్యకర్తలకు కుష్ఠు వ్యాధి నిర్ములనా కార్యక్రమం పై
బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రకంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారిని శ్యామల కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ కుష్టి వ్యాధి నిర్మూల సర్వే పై ఆశా వర్కర్లు, ఆరోగ్యకార్యకర్తలు,వైద్యాధికారులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. వైద్య అధికారులు కుష్టి వ్యాధి గూర్చి మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, నొప్పిలేని బుడిపెలు, లావుగా మారిన నొప్పితో కూడిన నరాలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు మొదలగు లక్షణాలు ఉన్న వారిని ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ప్రజలకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని, ఈ వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో  మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, మందులు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని,కుష్టు రహిత  సమాజం కోసం సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి రాధాకృష్ణ, పిహెచ్ ఎన్ సావిత్రి , ఎమ్ ఎల్ హెచ్ పీ లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.