Sidebar


Welcome to Vizag Express
నర్సు పోస్ట్ లు కోసం ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, మెరిట్ ప్రకారం ఎంపిక.

17-01-2025 19:12:15

నర్సు పోస్ట్ లు కోసం ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, మెరిట్ ప్రకారం ఎంపిక. విశాఖపట్నం - వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి, 17.        అత్యంత పారదర్శకంగా నర్సు పోస్ట్లు భర్టీ, మధ్య దళారులు నమ్మి మోసపోవద్దు,  రీజనల్ డైరెక్టర్ పి రాధా రాణి తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జోన్ 1 లో 106 నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సుమారుగా 255 పి హెచ్ సిలు, 72 ఏరియా హాస్పిటల్లు కు ఖాళీగా లు ప్రకారం కేటాయింపు చేస్తామని అన్నారు.టెక్కలి 14,చీపురుపల్లి 12 ఏరియా హాస్పిటల్లు ఎక్కువ ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తు లు కు అడిగిన సర్టిఫికెట్ లు ఉన్నది లేనిది పరిశీలన జరుగుతుందిని, లేనివారి పేర్లు నోటిస్ బోర్డు లో ఉంచుతామని అన్నారు.106 పోస్ట్లు కు ఇప్పటి వరకు 8 వేలుకు పైగా దరఖాస్తు వచ్చినట్లు, ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.29 తేదీ లోగా ఫైనల్ లిస్ట్ వెబ్సైటు లో, ఆఫీస్ బోర్డు లో పెడతామని తెలిపారు. అభ్యర్థులు కు కోటామార్కు లు ఉంటాయని, ప్రభుత్వ హాస్పిటల్ లో కోవిడ్ కాలంలో పనిచేసిన, ఇంతకు ముందు ప్రభుత్వ ఆసుపత్రి లో తాత్కాలిక గా పనిచేసిన, ఇదే కాకుండా అనుభవం ఉన్న సంత్సరాలు కు, మెరిట్ ఉన్న అదనపు మార్కులు కలుపుతామని వివరించారు.