Sidebar


Welcome to Vizag Express
శ్రీకృష్ణదేవరాయ కళ్యాణమండపం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

17-01-2025 19:17:46

శ్రీకృష్ణదేవరాయ కళ్యాణమండపం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17:
 నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కళ్యాణమండపం సంపూర్ణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని,కళ్యాణ మండపం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను  శుక్రవారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా, ప్రజల వివాహ శుభకార్యాల కోసం కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. స్థానికుల సహాయ సహకారాలతో కళ్యాణ మండపం నిర్మించినప్పటికీ,ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలి ఉందని తెలిపారు. అయినప్పటికీ అనేక శుభ కార్యక్రమాలు ఆ కళ్యాణమండపంలోనే నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విజయనగర సామ్రాజ్యఅధినేత ఆంధ్రభోజుడు, అష్టదిగ్గజకవుల పోషకుడు, కళాపిపాసి, కళాపోషకుడు అయిన శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయల జయంతిని కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, అయ్యన్న కాలనీ వాసులు ఆధ్వర్యంలో జరుపుకోవడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు  కళ్యాణ మండపం అభివృద్ధికి తమ వంతు సాయం అందజేశారని తెలిపారు. కళ్యాణ మండపం చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి నాలుగున్నర లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నకు కమిటీ సభ్యులు, అయన్న కాలనీవాసులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కళ్యాణ మండపం సంపూర్ణ అభివృద్ధికి మరింత నిధులు అవసరం ఉన్నందున దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా గాని, వస్తురూపేణ గాని సహాయం చేయాలని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ జయంతి వేడుకల్లో గొల్లవిల్లి రాము,కరణం ఈశ్వరరావు,గొల్లవిల్లి శివ,గాలి రమణ,కొడవటి గోపి,యర్రా దొరబాబు,రౌతు చిన్నయ్య,సుర్ల నాని,సహా అయ్యన్న కాలనీవాసులు పాల్గొన్నారు.