Sidebar


Welcome to Vizag Express
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చడంలో తెదేపా సర్కారు విఫలం.

17-01-2025 19:20:30

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చడంలో తెదేపా సర్కారు విఫలం.

పాడేరు శాసనసభ్యుడు విశ్వేశ్వర రాజు.
 చింతపల్లి,వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,జనవరి 17:
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో తెదేపా సర్కారు విఫలమయిందని పాడేరు శాసనసభ్యుడు మత్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. మండలం అన్నవరం పంచాయతీ సోమవారం గ్రామంలో వైకాపా నాయకులు సుండ్రు చిన్నబ్బాయి, సుండ్రు సూరిబాబులు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆహ్వానించిన మేరకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు పూర్తి కావస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అమలు సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తెదేపా నాడు చేసిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు మీనా మేసాలు లెక్కిస్తుందన్నారు. అబద్ధపు హామీలను నమ్మి  మోసపోయామని రాష్ట్ర ప్రజలందరూ వాపోతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మాయ మాటలు నమ్మి మోసపోయినప్పటికీ, మన్యప్రాంతవాసులు మాత్రం వైకాపాకు అండగా ఉండి పాడేరు నియోజకవర్గంలో తనను శాసనసభ్యునిగా గెలిపించినందుకు మన్యవాసుల రుణం తీర్చుకుంటానని,  ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం మత్స్యరాస విశ్వేశ్వర రాజు శాసనసభ్యులుగా విజయం సాధిస్తే ఆంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న సుండ్రు సూరిబాబు ఈ సందర్భంగా శాసనసభ్యుడు విశ్వేశ్వర రాజుతో కలసి ఆ మొక్కును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాంగి సన్యాసిరావు, తమ్ముంగుల సర్పంచ్ సలిమితి లక్ష్మయ్య, కుడుము సారి ఉప సర్పంచ్ కోటి బాబు, వైకాపా సీనియర్ నాయకుడు సాగిన గంగనపడాల్, మాజీ వైస్ ఎంపీపీ భూసరి కృష్ణారావు, వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు వనగల  బెన్నీ బాబు, సుండ్రు చిన్నబ్బాయి, కిలో ఆనంద్, పీసా కమిటీ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ, సిందేరి మహేష్ , కింతులంగి కృష్ణ, భీమరాజు, సుండ్రు సూరిబాబు, శోభ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు