Sidebar


Welcome to Vizag Express
యువ నేత రాజ్ కుమార్ కు ఘన సన్మానం

17-01-2025 19:22:56

యువ నేత రాజ్ కుమార్ కు ఘన సన్మానం 

అరకులోయ,వైజాగ్, ఎక్స్ ప్రెస్, జనవరి,17: సంక్రాంతి పండుగ సంబరాలను పురస్కరించుకొని అరకు వేలి మండలంలో గల చినలబుడు గ్రామపంచాయతీ ధొరవలస గ్రామంలో వైసిపి యువజన విభాగం నేత స్థానిక గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మొశ్య రాజ్ కుమార్ ను గ్రామస్తుల ఆహ్వానం తో శుక్రవారం ఆదివాసి గిరిజన సంప్రదాయలతో కొనసాగించే నృత్యం థింసా మహోత్సవమునకు విచ్చేసిన శుభ సందర్భంగా తిలకం దిద్ది మంగళ హారతులు ఇచ్చి దుస్సాలువతో సత్కరించి డప్పు వాయిద్యాలతో యువత కేరింతలతో గ్రామ పెద్దల సమక్షంలో భుజం మీద ఎత్తుకొని  ఊరేగింపు గా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ దొర వలస గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏ సహాయం సహకారం కావాలన్నా నన్ను సంప్రదించవచ్చునని మీ అభిమానం నాపై నిరంతరం ఉండాలని గ్రామంలోని క్రీడాకారులు నైపుణ్యంవంతంగా ఎదగడానికి తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దానిని సద్వినియోగం చేసుకోగలరని  వైసిపి యువ నేత  మొశ్య రాజ్ కుమార్ మాట్లాడారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా దొర వలస గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అనేక విధములుగా తోడ్పాటు అందిస్తున్నందుకు తమకు కృతజ్ఞత కలిగి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువతి యువకులు, మహిళలు స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.