కంబాలరాయుడు పేటలో వాలీబాల్ పోటీలు నేడు!
17-01-2025 19:26:08
కంబాలరాయుడు పేటలో వాలీబాల్ పోటీలు నేడు!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి ,17:
శ్రీ కారి, రాజు తులసమ్మ హిందూ సనాతన ధర్మం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కారి గోవిందరావు ఆధ్వర్యంలో వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడు పేట పల్లి గ్రామంలో ఈనెల 17 ( శనివారం ) నుంచి 19 వరకు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ ఆహ్వాన పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పాండురంగ సేవా సంఘం అధ్యక్షులు తోలాడ గురునాథం, యువజన సంఘం సభ్యులు తెలిపారు. మూడు రోజులు జరిగే ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ బహుమతి రూ ,10000 ద్వితీయ బహుమతి రూ ,5000 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు .పూర్తి వివరాలు కోసం 75 699 13 8 34 , 93 8 10 8 90 5 , 363 00 48725 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రవేశ రుసుం రూ 700 ఉంటుందని అన్నారు. గ్రామంలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కోసం ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ గోవిందరాజు యూత్ కు డొనేట్ చేసిన 25 వేల రూపాయలను గ్రామ సంఘం అధ్యక్షులు గురునాధం చేతుల మీదుగా యువకులకు శుక్రవారం అందజేశారు.కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు గ్రామస్తులు ,యువకులు ,మహిళలు అందరూ సహకరించాలని ఆయన కోరారు.