Sidebar


Welcome to Vizag Express
ఆంధ్ర అండర్ 14 క్రికెట్ టీమ్ లో బాపట్ల విద్యార్థి

17-01-2025 19:27:00

ఆంధ్ర అండర్ 14 క్రికెట్ టీమ్ లో బాపట్ల విద్యార్థి 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
ఆంధ్ర అండర్ 14 క్రికెట్ టీమ్ లో బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఉనైస్ కు అవకాశం దక్కింది.గత నెలలో జరిగిన అండర్ 14 జిల్లా స్థాయి ఎంపికలో తొలిసారిగా పాల్గొని గుంటూరు జిల్లా టీమ్ లో  ఫాస్ట్ బౌలర్ గా ఎంపికయ్యడు.కృష్ణ, చిత్తూరు,శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, అనంతపురం జిల్లాలతో జరిగిన పోటీలలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించాడు.విద్యార్థి అబ్దుల్ సాద్ వివిధ జిల్లాల్లో జరిగిన క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో విశేషమైన ప్రతిభా కనబరిచాడు.ఆంధ్ర అండర్ 14 క్రికెట్ టీమ్ లో ఉత్తమ ప్రతిభా కనబరచి 60 మంది క్రీడాకారుల్లో ఈ బాపట్ల విద్యార్థి స్థానం దక్కించుకున్నాడు.చివరిగా విజయనగరంలో జరిగిన జోనల్ పోటిల్లో 17 మందితో కూడిన ఆంధ్ర అండర్ 14 క్రికెట్ టీమ్ కు ఎంపిక చేశారు.అందులో అబ్దుల్ సాద్ కూడా ఒకడు కావడం విశేషం.ఈ నెల 27 వ తేది నుండి ఫిబ్రవరి నెల 18 వ తేది వరకు పాండిచ్చేరీలో జరిగే రాష్ట్రస్థాయి అండర్ 14 మ్యాచ్ లో అబ్దుల్ సాద్ పాల్గొననున్నాడు.అద్భుతమైన ప్రతిభ కనబరచిన అబ్దుల్ సాద్ ను ఉత్తమ క్రీడాకారునిగా తీర్చిదిద్ధడంలో కృషి చేసిన శిక్షకుడు అమీర్ ను ఈ సందర్బంగా పలువురు అభినందించారు.