Sidebar


Welcome to Vizag Express
ఎన్ టీ ఆర్ వర్ధంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

17-01-2025 19:28:12

ఎన్ టీ ఆర్ వర్ధంతి సందర్బంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి 

ఎమ్మెల్యే నరేంద్ర వర్మ 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థపాకులు నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్బంగా శనివారం బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బాపట్ల శాసనసభ్యులు వేగేషన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు.అదే విధంగా ఎన్ టీ ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని, విగ్రహాలు లేని చోట చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కోరారు.ఈ వర్ధంతి కార్యక్రమాల్లో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.