Sidebar


Welcome to Vizag Express
వీరుళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో విజయవంతం: ఎమ్మెల్యే నల్లమిల్లి

17-01-2025 19:29:02

వీరుళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో విజయవంతం: ఎమ్మెల్యే నల్లమిల్లి 
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 : మనమంతా కేవలం నిమిత్త మాత్రులమేనని అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న విధంగానే  వీరుళ్ళమ్మ తల్లి ఆశీస్సులతోనే కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.గురువారం రాత్రి అనపర్తి శ్రీ వీరుళ్ళమ్మ జాతర,తీర్థ మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వీరుళ్ళమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నల్లమిల్లిని పూలమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని "టెంపుల్ టూరిజం హబ్" గా  అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాలు విజయవంతంగా కృషి చేసిన అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో  టిడిపి మండల అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (దత్తుడు శ్రీను),సత్తి వెంకట రామారెడ్డి, పడాల కళ్యాణ్ రెడ్డి,మేడపాటి వెంకట రమణారెడ్డి, తాడి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.