Sidebar


Welcome to Vizag Express
7వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలనలో జోన్ 2 కమిషనర్ ఫణి కుమార్, ఏ.ఎం. హెచ్ ఓ.కిషోర్.

17-01-2025 19:31:43

7వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలనలో జోన్ 2 కమిషనర్ ఫణి కుమార్, ఏ.ఎం. హెచ్ ఓ.కిషోర్.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ : జీవీఎంసీ 7వ వార్డు మిథిలా పురి  వుడా  కాలనీ కాలనీలో  జోన్ టు కమీషనర్ ఫణి కుమార్, ఏ ఎమ్ హెచ్  కిషోర్ సచివాలయ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రోడ్లు కాలువలు పరిశీలించారు. ప్రధానంగా కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో వాటిలో పూడిక  తీయడం లేదని  తీయాలని హెచ్చరించారు. మైకా కవర్లు వాడకూడదని గోను సంచులు వాడాలని, ఈ దుకాణదారులు గాజు గ్లాసులు వాడాలని, కూరగాయలు దుకాణదారులు హోటల్స్ యజమానులకు తగిన సలహా సూచనలు ఇస్తూ అవసరమైతే ఫైన్ విధించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇప్పటికే అనేకమందికి ఫైన్ వేసామని, చాలావరకు కట్టడి అయిందని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు సహకరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తీతను దగ్గరుండి తీయించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.