Sidebar


Welcome to Vizag Express
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ - పవన్ వ్యాఖ్యలతో పలు అనుమానాలు

17-01-2025 19:32:40

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ - పవన్ వ్యాఖ్యలతో పలు అనుమానాలు 
అనపర్తి, జనవరి 16 : ఏపి రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.జాతీయ పార్టీ బిజెపితో టిడిపి,జనసేన పొత్తు పెట్టుకుని కూటమిగా ప్రజల్లోకి వచ్చి ఒకే గొడుగు కింద పనిచేసిన ఆపార్టీ నేతల మధ్య అగాధం ఏర్పడే అవకాశం ఉందని ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర వైకుంఠ దర్శన టోకెన్లు కోసం క్యూలో నిలబడి తోపులాటలో  భక్తులు చనిపోయిన తర్వాత పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టిటిడి చైర్మన్,ఇవో,సహాయ ఇవో క్షమాపణ చెప్పాలని ఎందుకు చెప్పకూడదు నేనే చెప్పాను అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.దానిని టిటిడి చైర్మన్ ఈజీగా తీసిపారేయటం వంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.దీనికి తోడు కొద్ది రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టిడిపి శ్రేణుల నుండి డిమాండ్ గట్టి గా వినిపిస్తోంది.మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి గా ఉన్నారు.అలాగని రెండో డిప్యూటీ సీఎంగా లోకేష్ ను నియమిస్తే పవన్ ప్రాధాన్యత తగ్గించినట్లు అవుతుందని దీంతో కూటమిలో లుకలుకలు ఏర్పడే అవకాశం ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.ఒక రకంగా టిడిపిలో కీలక మార్పులు, కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని రాజకీయంగా, పాలనా పరంగా సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ శైలి పైన రాజకీయంగా వాడి వేడి చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ప్రభుత్వంలో లోకేష్ కు ప్రాధాన్యత పెరగాలని టిడిపి నేతలు కోరుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఎనిమిది నెలలు మాత్రమే కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.దీంతో కొంతకాలం తర్వాత ఏమైనా మార్పులు జరుగుతాయా? లేక తొందరలో కూటమి ప్రభుత్వంలో ఏమైనా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయా అనే అనుమానం,చర్చ అనపర్తి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.సందట్లో సడేమియా అన్న చందంగా ఎప్పటినుంచో ఆంధ్రాలో పాగా వేయాలని చూస్తున్న జాతీయ పార్టీ ఏ విధంగా అడుగులు(వేయిస్తుందో)వేస్తోందో అనే అనుమానం అందరిలో నెలకొంది.టిడిపి,జనసేన మధ్య విభేదాలు ఏర్పడితే బిజెపి చక్రం తిప్పి జనసేనను తమ గుప్పిట్లో పెట్టుకొని చక్రం తిప్పుతుందని తలపండిన రాజకీయ మేధావుల అంచనా. కూటమిలో లుక లుకలకు ఆస్కారం ఉంటుందా? ఐదేళ్లు కలిసి పనిచేస్తుందా? అనేది వేయి డాలర్ల ప్రశ్న.