క్రీడలను ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం
17-01-2025 19:36:34
క్రీడలను ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17: క్రీడలు, క్రీడాకారులను తప్పని సరిగా ప్రోత్సాహించాలని ఆ దిశగానే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం సంక్రాంతి పురస్కరించుకొని అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో సోము యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మణికంఠ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కి ట్రోఫీ, రూ.25 వేల నగదు, రన్నర్స్ కి ట్రోఫీ,రూ.15 వేల నగదు ఎమ్మెల్యే నల్లమిల్లి చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (దత్తుడు శ్రీను),జనసేన నేత రావాడ నాగు,వెంకన్న బాబు, ఇంకా ఎన్డిఏ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.