గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు.76 వ గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా అధికారులతో స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది.గణతంత్ర దినోత్సవం కోసం పోలీసు కావాతు మైదానాన్ని సిద్ధం చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు.పోలీసు కవాతు నిర్వహించేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్ సీ సీ క్యాడేట్లు, స్కౌట్ విద్యార్థుల ప్రదర్శన నిర్వహణను పోలీసులు పర్యవేక్షించాలని అన్నారు. గణతంత్ర దినోత్సవానికి వచ్చే వివిధ పాఠశాలల విద్యార్థులుకు ఇబ్బంది కలగకుండా కవాతు మైదానంలో ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రక్యార్ జైన్, అడిషనల్ ఎస్ పి టీ పీ విఠలేశ్వర్, బాపట్ల ఆర్ డి ఓ గంగాధర్ గౌడ్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.