ప్రజా పోరాటాల యోధుడు జ్యోతిబసు కు నివాళులు.సిపిఎం.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ :
తను ఆసుపత్రి లో చికిత్స పొందుతూనే, చివరి శ్వాస వరకు ప్రజా ఉద్యమం ముందుకు తీసుకు వెళ్లాలని నినదించిన మహా నేత జ్యోతిబసు అని సిపిఎం మధురవాడ ప్రాంత నాయకులు కొనియాడారారు.జ్యోతిబసు 24 వ వర్ధంతి సందర్భంగా కొమ్మాది సి ఐ టీ యు కార్యాలయంలో శుక్రవారం నివాళులు అర్పించారు.ముందుగా బసు చిత్ర పటానికి సిపిఎం నాయకులు సియాద్రీ పైడి తల్లి పూవల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు డి అప్పలరాజు,రాజు కుమార్, మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం,పదవుల కోసం కాకుండా ప్రజల హక్కుల,కార్మికుల కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలియ చేసారు.ఈక్రమంలో అనేక నిర్బంధాలు,జైలు జీవితం అనుభవించారని అన్నారు.అనేక త్యాగాలు చేసి కమ్యూనిస్టు,ప్రజా నాయకుడిగా ప్రపంచ స్థాయి కి ఎదిగారని తెలియజేశారు.
సిపిఎం పార్టీ ముఖ్య మంత్రిగా పశ్చిమ బెంగాల్ లో ఐదు సార్లు ఎన్నికయ్యారని తెలియజేశారు.ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని అప్పటి ప్రతి పక్ష పార్టీలు ఒత్తిడి చేసిన,తను నమ్మిన సిద్ధాంతం కోసం,సిపిఎం పార్టీ ఉమ్మడి నిర్ణయానికి కట్టుబడి తృణప్రాయంగా ప్రధాని పదవిని కాదన్న గొప్ప నాయకుడు జ్యోతి బసు అని కొని యాడారు.ఈ కార్యక్రమంలో వండ్రాసి సంద్య,కే కొండమ్మా,టీ రమేష్,సి హెచ్ శేషుబాబు.తదితరులు పాల్గొన్నారు.