అంబాజీపేట - గన్నవరం రోడ్డు కొన్ని రోజులు మూసివేత!
పి.గన్నవరం, వైజాగ్ ఎక్స్ప్రెస్ జనవరి 17:
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా,
అంబాజీపేట - గన్నవరం రహదారిని రోడ్లు&భవనాల శాఖ సుమారు 20 రోజుల పాటు మూసివేయనున్నారు. రూ.10 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా పి.గన్నవరం నుంచి పోతవరం వరకు కిలోమీటర్ మేర సీ.సీ రోడ్డు వేయనున్నారు. ఈ మేరకు 20 రోజుల పాటు మూసేయాల్సి ఉంటుందని, ప్రయాణికులు గమనించవలసిందిగా, ఆ శాఖ డీ.ఈ.ఈ జి.రాజేంద్ర గురువారం తెలిపారు. ఈ నెల 20 నుంచి పనులు మొదలు పెట్టబోతున్నామని తెలిపారు.