Sidebar


Welcome to Vizag Express
తప్పుడు ఆరోపణలు చేయడం తగదు

25-01-2025 21:15:19

తప్పుడు ఆరోపణలు చేయడం తగదు

ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో పర్యవేక్షణ లోపం కారణంగా నవజాత శిశు మరణాలు జరిగాయి.



చింతపల్లి,వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ ,జనవరి 25,
వాముగెడ్డ కొత్తూరు గ్రామంలో వారంరోజుల వ్యవధి ముగ్గురు నవజాత శిశువులు మరణిస్తే దానిని వక్రీకరించి ప్రకటనలు చేయడం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎంపీపీ కోరాబు అనూష దేవి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు దురియా పుష్పలత అన్నారు. ఇది మన చౌడుపల్లి, కొత్తపాలెం సర్పంచ్లు లలిత, సోమరత్నం లతో కలిసి శనివారం వారు మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరించి ప్రకటనలు చేయడం  గిడ్డి ఈశ్వరికి అలవాటని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంలో గర్భిణీలకు గర్భిణీల వసతి గృహాలు (బెర్త్ వెయిటింగ్ హాల్స్) ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందించడం తోపాటు మాతాశిశు మరణాలు లేకుండా చేసామన్నారు. నేడు ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో పర్యవేక్షణ లోపించి నవజాత శిశు మరణాలు సంభవించాయన్నారు. ఒకే గ్రామంలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు నవజాత శిశువులు మృత్యువాత పడితే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించని ఆమె వాస్తవ విరుద్ధంగా ప్రకటనలు గుప్పించడం సిగ్గు చేటన్నారు. శిశువులు మరణించిన వారం రోజుల తర్వాత ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు చిత్కరిస్తున్నారన్నారు. బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను స్వయంగా వెళ్లి పరామర్శించి మనో నిబ్బరం కల్పించిన పాడేరు శాసనసభ్యుడు మత్యరాస విశ్వేశ్వరరాజు ని శిశు మరణాల పై రాజకీయం చేస్తున్నారని విమర్శించడం ఆమె అవివేకానికి నిదర్శనం అన్నారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆనేక ఆరోపణలు ఉన్నాయనీ, రోగులు ఆసుపత్రికి వెళితే కనీసం పట్టించుకోరనీ, తిడతారని, కసురుకుంటారని చింతపల్లిలో  ఎవరినడిగినా చెబుతారన్నారు. బాధిత కుటుంబాలు శిశువులను ఆసుపత్రికి తీసుకు వెళితే పట్టించుకోకపోవడం వలననే తమ పిల్లలు మరణించారని, ఆమె సరైన వైద్యం అందించి ఉంటే పిల్లలు బతికే వారనీ,  సిబ్బంది ఫోన్ చేసి పేషెంట్లు వచ్చారని చెప్పినా కనీసం ఆమె రాలేదని ఎలక్ట్రాన్ మీడియా ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తమ వరకు రాలేదా అని వారు ప్రశ్నించారు. అటువంటి వారిని వెనుకేసుకు రావడం తమ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం నాడు నేడు పేరిట గిరిజన ప్రాంతాల్లో విధ్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.  అందులో భాగంగానే పాడేరులో వైద్య కళాశాల, చింతపల్లి లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న విషయాన్ని కళ్ళు తెరిచి చూడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎటువంటి వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగు అయిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ గ్రామాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకొని ప్రకటనలు చేయాలని ఈ సందర్భంగా వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లీ, మాజీ వైస్ ఎంపిపి బూసరి కృష్ణారావు, సీనియర్ నాయకులు సాగిన గంగన్నపడాల్ ,వనగల బెన్నిబాబు, దాసరి మత్సరాజు, గెమ్మెలి సింహాచలం, పీసా ఉపాధ్యక్షులు లోచలి రాజారావు, పెదపూడి మధు, పసుపులేటి మత్యలింగం పడాల్ తదితరులు పాల్గొన్నారు.