హనీ ట్రాప్ లో ... 5 మంది నిందితుల అరెస్ట్
25-01-2025 21:22:01
హనీ ట్రాప్ లో ... 5 మంది నిందితుల అరెస్ట్
మరో ఇద్దరు పరార్
భీమిలి,వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 25: హనీ ట్రాప్ వ్యవహారాన్ని భీమిలి క్రైమ్ పోలీసులు ఛేదించారు.ఓ మహిళతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన ముంజు.రామారావును హనీ ట్రాప్ చేసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో రామారావును నిర్బంధించి సుమారు రూ.48 వేల నగదు,సెల్ ఫోన్,వేలెట్ ను ఓ మహిళతో కలిసి మరో ఆరుగురు దోచుకున్నారు. మరుసటి రోజు ఆయన అకౌంట్ నుండి కొంత నగదు పదే పదే బదిలీ అవ్వడంతో బాధితుడు రామారావు భీమిలి క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో శుక్రవారం భీమిలి క్రైమ్ పోలీసులు ఏడు మంది నిందితులలో ఐదుగురిని అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించారు.వీరిలో నగరంలోని కంచరపాలెం కు చెందిన కుప్పిలి ఆశారాణి(34), ఉషోదయ జంక్షన్ కు చెందిన మునపర్తి.వెంకటేష్ (29), విజయనగరం జిల్లా కు చెందిన బంగారి చక్రధర్ (37),డోల. లక్ష్మణ (27), ఇంటి.సురేష్ (30) లు ఉన్నారు.నగరానికి చెందిన వాసుపల్లి శ్యాం ప్రసాద్ (28), బారిక స్వామి (24) లు పరారయ్యారు.కుప్పిలి. ఆశారాణి,బంగారి.చక్రధర్ లు హనీ ట్రాప్ లో ప్రధాన భూమిక ను పోషించారు.వీరిలో బంగారు చక్రధర్,వాసుపల్లి.శ్యాం ప్రసాద్ ల పేరిట రౌడీషీటర్లుగా వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.పరార్ లో ఉన్న ఇద్దరు నిందితులు దొరుకునట్లు సమాచారం.