Sidebar


Welcome to Vizag Express
పురుగులు మందు తాగి తల్లి, కుమార్తె మృతి

25-01-2025 21:29:05

పురుగులు మందు తాగి తల్లి, కుమార్తె మృతి
 
చికిత్స పొందుతున్న మరో కుమార్తె

 భీమిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 25:
 భార్యాభర్తల గొడవతో  మనస్థాపం చెంది ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ వివాహత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో తల్లి మహంతి.మాధవి(25),కుమార్తె రితిక్స(02) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా శ్రీమన్నారాయణ పురం  ప్రాంతానికి చెందిన మహంతి. రామకృష్ణ (32) దివిస్ లేబరేటరీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు.కొన్ని నెలల క్రితం మాధవి తో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఇషిత(5), రితిక్ష(2) లతో తగరపువలస లో గొల్లవీధి ఆదర్శనగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ శుక్రవారం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు జరిగాయి.అనంతరం రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో విధులు నిర్వర్తించేందుకు మధ్యాహ్నం సమయంలో వెళ్ళాడు.రాత్రి 9 గంటల సమయంలో రామకృష్ణకు ఇరుగుపొరుగు వారు ఫోన్ చేసి భార్య పిల్లలు ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో ఎన్నారై ఆస్పత్రికి వెళ్ళగా భార్య చిన్న కుమార్తె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ భార్య మాధవి,చిన్న కుమార్తె రితిక్ష మృతి చెందారు.ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ.బి. సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.