Sidebar


Welcome to Vizag Express
భీమిలి పోలీస్ స్టేషన్లో మరో ఫోక్సో కేసు నమోదు

25-01-2025 21:30:50

భీమిలి పోలీస్ స్టేషన్లో మరో ఫోక్సో కేసు నమోదు
 నగ్న వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేసి బాధ్యత తల్లిని లోబరుచుకున్న కామాంధుడు

 వీడియోలు డిలీట్ కై లక్షల్లో డబ్బులు వసూలు

 భీమిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 25:
 
భీమిలి మండలం జీవీఎంసీ 2వ వార్డుకు చెందిన ఓ మైనర్ బాలికను నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి తల్లిని లోపర్చుకున్న కామాంధుడు.ఆ వీడియోలు డిలీట్ చెయ్యాలంటే లక్షల్లో నగదు కావాలని డిమాండ్ చేసి స్వాధీనం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...విశాఖ జిల్లా గాజువాకకు చెందిన జానకి రావు (53) బాధిత కుటుంబానికి దూరపు బంధువు ఎప్పటినుంచో మైనర్ బాలిక తల్లి పై కామ కోరిక ఉండడంతో పండగ సమయాలలో ఇంటికి పిలిచేవాడు.ఈ నేపథ్యంలో మైనర్ బాలిక గదిలో  వస్త్రాలను మారుస్తుండగా చిత్రీకరించాడు.దీంతో తరచూ బ్లాక్ మెయిల్ చేసి తల్లిని లోబర్చుకునేవాడు.ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది.ఈ క్రమంలో జానకిరావును భార్య భర్తల ప్రశ్నించగా వీడియోలు డిలీట్ చెయ్యాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి భార్యాభర్తల అంగీకరించడంతో అరుకు రమ్మన్నాడు.డబ్బు ఇచ్చిన సరే వీడియోలు డిలీట్ చెయ్యకపోగా పదే పదే బ్లాక్ మెయిల్ చేయడంతో బాధితులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ.బి.సుధాకర్  
 జానకి రావు పై ఫోక్స్ కేసు నమోదు చేశారు.జానకి రావు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం  చేస్తున్నాడని సమాచారం.