75 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు కి శంకుస్థాపనలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం
గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 25,
కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కి పెద్ద పీట వేస్తుందని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి , 87వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) అన్నారు. శనివారం జీవీఎంసీ 87 వార్డు లో సుమారు 75 లక్షలు అభివృద్ధి పనులు కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తామని ఇండోర్ స్టేడియం మరియు ప్రధాన గెడ్డను అభివృద్ధి చేయటం లక్ష్యం గా పెట్టుకున్నామని అన్నారు. రెండు నెలల్లో సుమారు పది కోట్ల రూపాయలు తో అభివృద్ధి పనులు కి శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. స్మార్ట్ వార్డు గా అభివృద్ధి చేస్తానని గ్రేటర్ లో అభివృద్ధి లో ప్రధమ స్థానం మన వార్డు ఉండేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. దశబ్ద కాలం గా పెండింగ్ లో ఉన్న గ్రౌండ్ న ఎమ్మెల్యే సహకారం తో పూర్తి చేస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు రాజన్ రాజు, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, జనసేన వైస్ ప్రెసిడెంట్ కర్రి నరసింగరావు, ఇందిరా ప్రియదర్శిని,సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, ద్రోణాద్రి అప్పలనాయుడు,కనక సత్యం, దాలయ్య, ఏటీయన్ మూర్తి,కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్,కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, బోండా శ్రీను, నాగరాజు, సూరిబాబు, నూకరాజు,పాల్,నాగేశ్వరావు,మోహన్ రావు, కర్రి రాజు, గోకాడ భాస్కర్ , సచివాలయం సిబ్బంది మహాలక్ష్మి, విశ్వకాంత్,జయశ్రీ, దుర్గాప్రసాద్, గండి వెంకటరమమూర్తి, చరణ్ తేజ, మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు