శ్రీ దేవీ భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోభారీ అన్న ప్రసాదం
గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 25, జీవీఎంసీ పరిధి 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రియదర్శిని కాలనీ వాస్తవ్యులు లంకాడ శ్రీను, రేవతి దంపతుల కుమారుడు వినయ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న ప్రసాదం ను నిర్వహించారు.ముఖ్య అతిథులు మాట్లాడుతూ భక్తులకు స్థానిక నివాసులైన అందరికీ స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాదంనిర్వహించడం జరుగుతుంది అన్నారు. స్వామివారి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలుద్దాము అని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర, తాతయ్య చార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం లంబాల దుర్గాప్రసాద్ వారి బృందంచే అన్నమాచార్య కీర్తనలు ఆలపించబడుతుంది. 29
బుధవారం అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి మహాభిషేకం మరియు హోమము జరుపబడును. 30వ తేదీ శ్రావణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి మహాభిషేకం నిర్వహించబడును అని ఆలయ నిర్వహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ వర్మ, జయలక్ష్మి, వరలక్ష్మి, గొరుసు రామలక్ష్మి,ఉషారాణి, బి. వరలక్ష్మి, నాగమణి,చిట్టమ్మ,కాంతమ్మ,,చిన్నమ్మలు, పండూరి సత్యవతి,లక్ష్మమ్మ,గవర లక్ష్మి, జి. పద్మావతి, కే. భవాని, కనకమహాలక్ష్మి, రూప, సావిత్రి, జ్యోతి, పద్మ,లతా, బావనమ్మ, రూపా దేవి, చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు