Sidebar


Welcome to Vizag Express
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కృషి,ఎమ్మెల్యే సత్యానంద రావు

25-01-2025 21:40:13

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కృషి,ఎమ్మెల్యే సత్యానంద రావు

కొత్తపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:
పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తరుపున చేయాల్సిన కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఆసుపత్రిని ఏ విధంగా అభివృద్ధి చేశానో మరలా అదే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.గత ప్రభుత్వ నిర్వాకంతో 70 పడకల ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రిగా మారడం బాధాకరం అని మరలా ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే నూతనంగా ఏర్పాటు అయిన ఈ కమిటీ ఆసుపత్రి అభివృద్ధికి,మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆసుపత్రికి వచ్చే రోగుల అవసరార్థం అవసరమైన వసతులు కల్పించేందుకు దాతల నుండి అయిదు లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.అలాగే నేటి సమావేశ తీర్మానంలో పొందుపరిచిన అంశాలను ఆమోదిస్తున్నామని సత్యానందరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.