విజయసాయి రెడ్డి రాజీనామా అంతా డ్రామా:
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్:
నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:
రాజీనామా నెపంతో తప్పించుకుని తిరిగేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని, మాజీ సీఎం జగన్‌తో కలిసి డ్రామాలు ఆడుతున్నారని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు విజయ సాయి రెడ్డి రాజీనామా పై, శనివారం నర్సీపట్నంలో గల తన నివాసంలో విజయ్ స్పందించారు. జగన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అవుతుందనడానికి సంకేతం, విజయ సాయి రెడ్డి రాజీనామా చేయడమేనని అన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వైసీపీని వదిలిపెట్టే పరిస్థితి వస్తుందని తెలిపారు.
విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలపై తానే స్వయంగా పిర్యాదు చేస్తానని, గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం ఘటన నుంచి అనేక అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబును రామతీర్థానికి వెళ్లకుండా అడ్డుకున్నప్పటి సంఘటనను ప్రస్తావిస్తూ, అప్పటి దారుణాలకు బాధ్యులైన వారెవ్వరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
ఆశోక్ గజపతిరాజు ఆస్తులను కాజేయడం కోసం,సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా వేరే వ్యక్తిని నియమించారని, ఆస్తుల కోసం హింసించిన వ్యక్తి విజయసాయిరెడ్డే నని ఆరోపించారు. శనివారాలు వస్తే ఏ ఇల్లు పగలగొడతారో, ఏ కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారో అని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందేవారని అన్నారు.
దసపల్లా ఆస్తుల కబ్జా, వాల్తేర్ క్లబ్ సంఘటనలు విశాఖ ప్రజలు ఎప్పటికి మరిచిపోలేరని అన్నారు. కోవిడ్ సమయంలో నలంద కిషోర్‌ను ఇబ్బంది పెట్టిన విషయం కేవలం ఉదాహరణ మాత్రమేనని అన్నారు. టీడీపీ నాయకులు కళా వెంకటరావు, ఆచ్చెన్నాయుడు లను అన్యాయంగా అరెస్టు చేయించి టీడీపీ నాయకులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు.
రుషికొండ నిర్మాణాల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని, తన కూతురునే సీ పోర్ట్ అనే సంస్థ యజమానిగా పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చర్యలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం విజయసాయిరెడ్డి ముందుకు నెట్టారని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై అనేక కేసులు పెట్టించినప్పటికి తమ పార్టీ నాయకులు ధైర్యంగా ప్రతిఘటించారని చెప్పారు. వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని విజ