Sidebar


Welcome to Vizag Express
లక్ష దీపోత్సవం కరపత్రాలు ఆవిష్కరణ: నర్సీపట్నం

25-01-2025 21:48:48

లక్ష దీపోత్సవం కరపత్రాలు ఆవిష్కరణ: నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25;
23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం సందర్భంగా కరపత్రాలు, పోస్టర్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 2025 ఫిబ్రవరి 8వ తేదీ, శనివారం నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. ఉదయం గం.5:15 నిమిషాలకు కాకడ హారతితో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.  6:30 నిమిషాలకు నిత్యపూజ, నిత్య హోమం జరుగునని తెలిపారు. 8 గంటలకు బాబాగారి అభిషేకాలు నిర్వహించబడతాయని, అభిషేకానికి ముందుగానే భక్తులు తమ పేర్లు,గోత్ర నామాలు నమోదు చేయించుకోవాల్సినదిగా ఆలయ కమిటీ సూచించింది. మధ్యాహ్నం 12:00 గంటలకు హారతితో పాటుగా అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.సాయంత్రం 5:00 గంటలకు ఎన్‌.టి.ఆర్‌. మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం ఘనంగా జరుగుతుందని, దీపారాధన కార్యక్రమాన్ని శాసన సభాపతి సి.హెచ్. అయ్యన్నపాత్రుడు,శ్రీమతి పద్మావతి దంపతులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, శ్రీమతి సువర్ణ దంపతులు. 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, శ్రీమతి దివ్యశ్రీ దంపతులు, ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భక్తులు దీపాలంకరణకు కావలసిన కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు తీసుకురావలసిందిగా కోరారు. దీపారాధన అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, సాయిచాలీసా పారాయణ, భజన మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. రాత్రి 9:00 గంటలకు శేజ్ హారతి సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుందని, పట్టణ పరిసర ప్రాంత భక్తులందరూ 23వ లక్ష ప్రమిద దీపాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని, షిరిడి సాయినాధుని కృపా కటాక్షములు పొందవలెనని, తీర్థ ప్రసాదములు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.