Sidebar


Welcome to Vizag Express
నర్సీపట్నంలో ఫిబ్రవరి 9న సూర్య నమస్కార యాగం ఏర్పాటు

25-01-2025 21:50:37

నర్సీపట్నంలో ఫిబ్రవరి 9న సూర్య నమస్కార యాగం ఏర్పాటు: నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 25:
మాఘ శుద్ధ ద్వాదశి శుభసందర్భంగా ఫిబ్రవరి 9 ఆదివారం, నర్సీపట్నం శారదా స్కూల్ ప్రాంగణంలో, సూర్యనమస్కార సౌరయాగం అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు, పురోహిత యువత తెలిపారు. సూర్య నమస్కారం సౌర యాగం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను, పోస్టర్లను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి "చింతకాయల విజయ్" శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పూజా కార్యక్రమంలో భవిష్యోత్తర పురాణోక్త ద్వాదశ యంత్రార్చన, సూర్యనమస్కార సహిత మహాసౌర హవనం (హోమం) నిర్వహించబడుతుందని  తెలిపారు. ఈ యాగంలో 12 మంది బ్రాహ్మణులు ఏకకాలంలో సూర్యనమస్కారాలు నిర్వహించనున్నారని అన్నారు.
భక్తులు తమ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ యాగం నర్సీపట్నం పురప్రజలు, ప్రముఖులు, భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పురోహితుడు వి. నర్సింహమూర్తి, భధ్రాచల రామం,ఎన్.కుమార్,కె అంజన్, సి.హెచ్.చందు, పేరి ఆదిత్య, కె.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.