రణస్థలం ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం.
రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25
ర్యాలీ, మానవహారం ఏర్పాటు పలు పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే, ఈఆర్వో రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఈ.ఆర్.వో.ఎస్.వి. లక్ష్మణమూర్తి, తహసీల్దార్ ఎన్. ప్రసాదరావు ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం ఏర్పాటుచేశారు. ఓటు ప్రాముఖ్యతను వివరించేల విద్యార్థులకు రంగోలి, వ్యాసరచన, వక్తృత్వం, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.
ఓటర్లకు సన్మానం
ప్రతి సంవత్సరం ఓటును సద్వినియోగం చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారినీ,దివ్యాంగ ఓటర్లను, ట్రాన్స్ జెండర్ ఓటరును అధికారులు సత్కరించారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
ఉత్తమ బీ.ఎల్.వో గా బమ్మిడి అమ్మోజీ
కోస్టా పంచాయతీ లో పి.ఎస్.183 బిఎల్ఓ గా విధులు నిర్వహిస్తున్న సచివాలయం మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజిని ఉత్తమ బిఎల్ఓ గా ఎంపిక చేశారు. ఎమ్మెల్యే, ఈఆర్వో, ఎమ్మార్వో ఇతర అధికారుల చేతుల మీదుగా ప్రశంసాపత్రము అందజేసి సత్కరించారు.
ఓటరు దినోత్సవ వేడుకల్లో ఎంపీడీవో ఈశ్వరరావు, ఎస్సై చిరంజీవి, డిప్యూటీ తహసిల్దార్ హేమసుందర్, తహసీల్దార్ కార్యాలయం సూపర్ వైజర్లు, సిబ్బంది, వీఆర్వో లు పాల్గొన్నారు.