బండి పాలెం బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.
25-01-2025 21:56:46
బండి పాలెం బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.
రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి
రణస్థలం పంచాయతీ లో ఉన్న బండి పాలెం బిటి రోడ్డు నిర్మాణం పనులు కోసం శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా బండి పాలెం, నగర పాలెం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని, అభివృద్ధి పథంలో మన ఎచ్చెర్ల నియోజకవర్గం ను నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానోజీ నాయుడు, లంక శ్యామలరావు, పీసీని జగన్నాధం నాయుడు,రౌతు శ్రీనివాసరావు, , దన్నాన మహేష్ , స్థానిక నాయకులు ఎంపిటిసి మజ్జి వెంకటరమణ, గొర్లె జనార్ధన్,గొర్లె హరిబాబు, వాళ్లే రమణ,ఎంపీడీవో గారు, మండల ఇంజినీర్,అధికారులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు