Sidebar


Welcome to Vizag Express
‌రంగస్థల నటుడు ముళ్ళపూడికి ఇండియన్ ఐకాన్ పురస్కారం

25-01-2025 22:01:21

‌రంగస్థల నటుడు ముళ్ళపూడికి ఇండియన్ ఐకాన్ పురస్కారం   
                జి.సిగడాం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25: 

ప్రముఖ రంగస్థల నటుడు,నంది అవార్డు గ్రహీత,అభినవ దుర్యోధన ముళ్ళపూడి రామచంద్రరావు(ఆర్.సిహెచ్.అగ్రహారం)స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారానికి ఎంపికయ్యారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.ఫిబ్రవరి 2న విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ అవార్డును నటుడు రామచంద్రరావుకు ప్రదానం చేస్తారు.ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది.రామచంద్రరావు 1987 ముఖానికి రంగు వేసుకుని రంగస్థల రంగంలో అడుగు పెట్టారు.అప్పటి నుంచి వెనక్కి చూడలేదు.అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు.ఇంతవరకు రెండు నంది అవార్డులు, రెండు గరుడ అవార్డులను అందుకున్నారు.ఒంగోలు ఎన్టీఆర్ కళా పరిషత్ లో రెండు ఉత్తమ అవార్డులను గ్రహించారు.ఆకాశవాణిలో బి.గ్రేడ్ ఆర్టిస్టుగా ఉన్నారు.పాండవోద్యోగవిజయాల్లో దుర్యోధన పాత్ర,అందునా మయసభ సీను ఆయనకు ఆంధ్రావనిలో ఎనలేని గుర్తింపు తెచ్చింది.చింతామణిలో శ్రీహరి పాత్ర, అలాగే ఆయా నాటకాల్లో విశ్వామిత్ర, యయాతి, అర్జునుడు తదితర పొత్రలు ముళ్ళపూడిని విజయపథంలో నడిపించాయి.తాజాగా ఆయనకు ఇండియన్ ఐకాన్ రావడం పట్ల రంగస్థల కళాకారులు ఉయ్యూరు దుర్గాప్రసాద్,ఉరిటి మురళీమోహనరావు,ఎం.జగన్నాథం,కాళ్లకూరి శాంతారాం,బగాది వెంకటరావు, బొడ్డేపల్లి జనార్దనరావు తదితరులు అభినందించారు.