Sidebar


Welcome to Vizag Express
మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ

25-01-2025 22:06:44

మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 25: 

 బెంగళూరులో జరుగు అంతర్రాష్ట్ర హెడేన్ ప్రోగ్రాంకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎంఎస్ పల్లి ఏపీ మోడల్ స్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు తమ యొక్క ప్రతిభను కనబరిచారు.  రాష్ట్రంలో సెలెక్ట్ అయిన రెండు పాఠశాలలలో ఒకటి ఎంఎస్ పల్లి మోడల్ పాఠశాల కావడం గర్వించదగ్గ విషయం.విద్యార్థుల  సృజనాత్మకతతో తయారుచేసిన ప్రాజెక్టును తర్ఫీదు ఇవ్వటానికి బెంగళూరు నుండి వచ్చిన ట్రైనర్స్ వారం రోజులు పాటు ట్రైనింగ్ ఇస్తూ తమ యొక్క ప్రతిభను గుర్తించారు. జనవరి 27 నుండి ఫిబ్రవరి ఒకటవ కు తేదీ వరకు జరుగు కార్యక్రమానికి ఐదుగురు విద్యార్థులకు గైడ్ ఉపాధ్యాయులకు బెంగుళూరు వెళ్లి వచ్చుటకు ఉచిత ప్రయాణం విమాన ఖర్చులు ఫైవ్ స్టార్ వసతి కల్పించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు  ఆరాధ్య పాణిగ్రహి, శ్రద్ధాంజలి మహంతి, యుస్మాన్ చౌదరి ,రితికబాడిత్య ,శ్రద్ధాంజలి మహంతి లు స్థానిక ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు వద్ద తాము చేసిన ప్రాజెక్టు వివరాలను తెలియజేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్ శివప్రసాద్, మండల విద్యాశాఖ అధికారులు శివరాం ప్రసాద్, చిట్టిబాబు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.