Sidebar


Welcome to Vizag Express
ఓటే వజ్రాయుధం ప్రిన్సిపాల్ రామారావు

25-01-2025 22:13:18

ఓటే వజ్రాయుధం

ప్రిన్సిపాల్ రామారావు

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 25:

సామాన్యుడి చేతిలో ఓటే వజ్రాయుధమని బారువ  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి రామారావు అన్నారు. వయోజనులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందేలా విద్యార్థులంతా తమ గ్రామాల్లో అవగాహన కల్పించాలని కళాశాల విద్యార్థులకు సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఓటు హక్కుపై శనివారం అవగాహన కల్పించి,  ప్రతిజ్ఞ చేయించారు. దేశ రాజకీయాలను మార్చే ఓటు హక్కు నమోదు విషయంలో గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. నథింగ్‌ లైక్‌ ఓటింగ్‌, ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌ అనే నినాదంతో ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి ,రామకృష్ణ , ఎన్ఎస్ఎస్ పివో రాజేంద్రప్రసాద్ ,పి ,స్నేహలత ,అద్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.