అంగన్వాడీ కార్యకర్తలకు నియామక పత్రాలు
25-01-2025 22:32:49
అంగన్వాడీ కార్యకర్తలకు నియామక పత్రాలు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 25:
అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు సంబంధించి పలాస మండలానికి విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి నిర్వహించిన ఇంటర్యూలో ముగ్గురు ఎంపికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరికట్ల విఠల్ రావు, రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కుత్తుం లక్షణ్ కుమార్ శనివారం అందజేశారు. పీఎం జన్ మన్ లో భాగంగా తర్లాకోట పంచాయితీలో నూతనంగా మంజూరైన కొటారింగి తాళ్లభద్ర, సిరిపురం గ్రామాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా ఎంపికైన సవర జానకి, సవర రజినీ, లోత్తూరు పంచాయతీ పెద్దపల్లియ కి చెందిన సవర ప్రమిల నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్, బడ్డ నాగరాజు, లోడగల కామేష్, హోరియా మోహన్ రావు, మురిపింటి కుమార్ రాజ, సవర సోమేశ్, అవుగన దశరథ తదితరులు పాల్గొన్నారు