ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 25:
ఆటో డ్రైవర్లు తమ వాహనాలను నడిపే సమయంలో నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని
ఇచ్చాపురం ఎం. వి. ఐ గోవిందరాజులు కోరారు.
సోంపేట పట్టణంలో ఆటో డ్రైవర్లు, యూనియన్ సభ్యులకు పోలీసులు 'సంకల్పం' కార్యక్రమంలో శనివారం అవగాహన కల్పించారు. మత్తుపదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం, గంజాయి రవాణా చేయడం వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సోంపేట సీఐ మంగరాజు అన్నారు. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించాలని, ప్రయాణిస్తున్న ప్రయాణికుల పట్ల సహృదయం కలిగి ఉండాలని ఇచ్చాపురం ఎం. వి. ఐ గోవిందరాజులు అన్నారు