కళాకారుడు రాంబాబు మృతి
25-01-2025 22:38:14
కళాకారుడు రాంబాబు మృతి
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 25:
బైపల్లి యువజన సేవా సంఘం, భిలాయి పూర్వ అధ్యక్షుడు స్వర్గీయ చీగటి లత్సయ్య ప్రథమ పుత్రుడు, కళ్యాణి ఫైన్ ఆర్ట్స్ సంస్థాపకుడు, భిలాయి బైపల్లి యువజన సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, రంగస్థల కళాకారుడు, తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ రంగస్థల కళాకారులు ఛత్తీస్గఢ్ సినీ కళాకారుల రూప శిల్పి, అనేక పరిషత్తుల్లో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ చీగటి రాంబాబు (67) శనివారం ఉదయం భిలాయ్ లో మృతి చెందారు. కుర్సీపార్ బాలాజీ నగర్ లో తన స్వగృహం నుంచి రామనగర్ శ్మశాన వాటిక లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు మొరుపల్లి బాబూరావు ,మడ్డు ,నాగేశ్వరరావు తదితరులు సంతాప సభలో మాట్లాడుతూ ,ఇటు వంటి దుఃఖ భరితమైన ఘడియల్లో ఆ శోకతప్త కుటుంబ సభ్యులకు మనో స్థైర్యాన్ని కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బైపల్లి యువజన సేవా సంఘం సభ్యులు ,భిలాయ్ ,పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రవాసాంధ్ర తెలుగు సంఘాలు ,కళా, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. తన కళలుతో భిలాయ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గుర్తింపు పొందారని ఆయన లేని లోటు తీరనిది అంటూ ఆవేదన వ్యక్తంచేశారు