ఘనంగా ఓటర్ల దినోత్సవం
25-01-2025 22:41:14
ఘనంగా ఓటర్ల దినోత్సవం
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:
కొమరాడ మండలంలోని గుమడ గ్రామంలో బి ఎల్ ఓ ప్రవల్లిక ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ ల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమమునకు గుమడ కూటమి నాయకులు, పాల్గొన్నారు. ఆమె వారందరూ చేత ప్రతిజ్ఞ చేయించారు. బి ఎల్ ఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్గా ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు . ఓటు ప్రతి భారతీయుడు హక్కు అని అన్నారు. ఆమె సీనియర్ ఓటర్లుకు సాలువల తో సన్మానించారు. పాఠశాలలోని విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించి అందులో గెలిచిన ప్రధమ, ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలిచిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ చందక గాయత్రి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ చందక అప్పల నాయుడు, జనసేన పార్టీ నాయకుడు కిల్లానఅనంత్,కర్రి వాసునాయుడు, చందక గోవిందరావు,శివాజీ, జన సైనికులు, బిజెపి పార్టీ బూత్ కన్వీనర్ అప్పలనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఓటర్లు పాల్గొన్నారు.