పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏకలవ్య పాఠశాలల సమస్యలు పరిష్కరించడి
కలెక్టర్ ను కోరిన స్కూల్ కమిటీ చైర్మన్లు
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్ , జనవరి 25:
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రము లో ఏకలవ్య పాఠశాలలు అనసభద్ర, కొటికపెంట, భామిని ఏకలవ్య పాఠశాలలు పేరెంట్స్ కమీటి సభ్యులు జిల్లా కలెక్టర్ కి కొన్ని సమస్యలు పై వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏకలవ్య నూతన భవనాలు ప్రారంభించాలని, ప్రధానంగా నూతన భవనాలలో ప్రహరీ గోడ నిర్మించాలని, త్రాగు నీరు అందివ్వాలని, ఆటస్థలం నిర్మించాలని, బట్టలు శుభ్రం చేసుకొనుటకు ప్లాంట్ ఫామ్, నూతనంగా నిర్మించిన భవనాలలో కిటికీల దగ్గర ఐరన్ గ్రిల్స్ పెట్టాలని, అలాగే వెంటిలేటర్స్ లలో కూడా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయా పాఠశాలల చైర్మన్లు అన్నారు