Sidebar


Welcome to Vizag Express
దాన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఒక సామాజిక అంశంపై వాకధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ వస్తుంది

26-01-2025 16:15:31

విశాఖపట్నం -వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి, 25:
దాన్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఒక సామాజిక అంశంపై వాకధాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా ధాన్ వైజాగ్ రీజియన్ ఆధ్వర్యంలో ఈరోజు "అభివృద్ధి భాగస్వామ్యం" అనే అంశంపై "వాకథాన్" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ మరియు సైబర్ సెక్యూరిటీ మొదలైన అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది. 1400 మంది కళంజియ మహిళలు సబ్మెరైన్ సెంటర్ నుండి ప్రదర్శనగా , వుడా పార్క్ ఎంజీఆర్ గౌండ్ ప్రాంగణానికి చేరుకున్నారు, ఈ ర్యాలీని 18వ వార్డు కార్పొరేటర్   శ్రీమతి గొలగాని మంగవేణిగారు మరియు జీవీఎంసీ 19వ వార్డు స్టాండింగ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్  నూకరత్నం గారు జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. అనంతరం ఎంజీఆర్ గ్రౌండ్ నందు సభ నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వైజాగ్ రూరల్ రీజియన్ కో.ఆర్డినేటర్ శ్రీ రామ్ కుమార్ స్వాగత ఉపన్యాసం చెయ్యగా, అర్బన్ & కోస్టల్ రీజనల్ కో.ఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి వాకథాన్ ఉద్దేశ్యాన్ని తెలియజేసారు.అదే విధంగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రెడింగ్టన్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ యూసిడి పి.డి శ్రీమతి సత్యవేణి గారు మాట్లాడుతూ, కళంజియ మహిళలంతా ఎంతో క్రమశిక్షణగా తమ ఆర్థిక అభివృద్ధి కొరకు మాత్రమే కాకుండా , సామాజిక అవగాహనతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని అభినందనలు తెలియజేశారు, అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ నివారణకు మహిళలంతా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు, మరో ముఖ్య అతిథి, బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ అఫీస్ సీనియర్ మేనేజర్ శ్రీ మురళీ గారు మాట్లాడుతూ కళంజియం ఆర్థిక కార్యక్రమాలతో పాటు, ఆరోగ్య, జీవనోపాధి మరియు విద్యా కార్యక్రమాలలో సైతం ముందు పీఠిన నిలవడం గొప్పవిషయం అని కొనియాడారు. గత 20 ఏళ్లుగా ధాన్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన మరో అతిథి, సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీ భవానీ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈరోజుల్లో సైబర్ నేరాలు చాలా పెరిగాయని వాటి బారినపడి ఎంతో మంది నష్టపోతున్నారని దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దానికి మీ సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ లక్ష్మణరావుగారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కిషోర్ గుప్తా గారు, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ నిచెర్ల జానిగారు మరియు క్యూర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ శ్రీ లోకేష్ గారు మరియు వివిధ సమాఖ్యల నాయకులు శ్రీమతి వెంకట రత్నం, గౌరి, దివ్య,సబిదా, ఉమా మహేశ్వరీ గారు ప్రసంగించారు మరియు అధిక సంఖ్యలో కళంజియ పొదుపు సంఘాల సభ్యులు,ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు