గణతంత్ర దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి
నెల్లిమర్ల :వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 26
రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆనందించడమే కాదు, వాటి విలువను గౌరవిస్తూ బాధ్యతలను కూడా నిజాయితీగా నిర్వహించాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి చెందడం ద్వారా సమాజం పురోగమిస్తుంది. హక్కులు మన స్వేచ్ఛను ఇస్తాయి, బాధ్యతలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
దేశ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే లోకం మాధవి దేశప్రజలందరికీ స్వేఛ్చ,సమానత్వాలను అందించడానికి మహనీయులు రూపొందించిన రాజ్యాంగానికి సమర్థుల పాలనలోనే పరిపూర్ణత చేకూరుతుంది. మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనది. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రసాదించింది మన రాజ్యాంగం. రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులుగా మన బాధ్యత. ఆ బాధ్యతను సదా నిర్వహిస్తూ… ప్రజాస్వామ్యానికి అండగా ఉండేందుకు మనందరం కృషి చేద్ధాం. ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుపుతూ నెల్లిమర్ల నియోజవర్గం జనసేన ఎమ్మెల్యే గారు లోకం నాగ మాధవి గారు
గణతంత్ర దినోత్సవం నెల్లిమర్ల నియోజవర్గం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పా నెల్లిమర్ల మండలం జనసేన అధ్యక్షులు పతివాడ అచ్చం నాయుడు, సీనియర్ నాయకులు చలమల రమణ, పిన్నింటి రాజారావు, పైల శంకర్,గుడివాడ జమరాజు, దిండి రామారావు,కారే అప్పలరాజు, నాని డెంకాడ మండలం సీనియర్ నాయకులు బంటు పెళ్లి వాసుదేవరావు, ఎంపీపీ భోగాపురం మండలం సీనియర్ నాయకులు రాంబాబు, పి జగదీష్, రాజుగారు గోవిందా, సీనియర్ నాయకురాలు ప్రమీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.