ఉదారతను చాటుకున్న పల్లిపేట గ్రామం కి చెందిన శ్రీ రామ యువసేవా సంఘం
రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 26
రణస్థలం పల్లిపేట గ్రామం కి చెందిన శ్రీరామ యువ సేవా సంఘం వారు నెలివాడ గ్రామానికి చెందిన ఎందువ అప్పలనాయుడు, దమయంతి దంపతుల కుమారుడు వర్ధన్ బాబు బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించి వారికి శ్రీరామ యువసేవా సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలుతరఫున 40,000 రూపాయలను సంఘం సభ్యులందరూ కలిసి వారి కుటుంబానికి అందజేశారు అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా శ్రీరామ యువసేన సంఘం సభ్యులకి ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ గ్రామ ప్రజలు మరియు వైజాగ్ ఎక్స్ ప్రెస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం