Sidebar


Welcome to Vizag Express
చీపురుపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ఘనత వైస్సార్సీపీ నాయకులకు దక్కుతుంది

26-01-2025 18:09:42

చీపురుపల్లి, వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్, జనవరి 26: చీపురుపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ఘనత వైస్సార్సీపీ నాయకులకు దక్కుతుంది అని - జడ్పీటీసీ ప్రతినిధి,జిల్లా వైస్సార్ పార్టీ జిల్లా ప్రచారవిభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివానాయుడు అన్నారు. చీపురుపల్లి మండలం, చీపురుపల్లి పట్టణం, జి. అగ్రహారం నుండి తోటపల్లి కాలువ కు అనుకోని గరివిడి మండలం వెదుళ్ళవలస,మెరకముడిదాం మండలం బిళ్ళలవలస గ్రామం మీదుగా గరివిడి నుండి గర్భం  ఆర్ &బి రోడ్డు వరకు సుమారు 8 కోట్ల రూపాయలు నిధులతో (పి. ఎం. జి. ఎస్.గ్రాంట్ )లో తారురోడ్ ను గత వైస్సార్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్యులు, చీపురుపల్లి శాసన సభ్యులు, ఇప్పటి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ( సత్తిబాబు ), గారు మరియు విజయనగరంజిల్లా జడ్పీ చైర్మన్ మరియు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, మజ్జి శ్రీనివాసరావు గారి కృషి తో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు చీపురుపల్లి నియోజకవర్గం లో సుమారు 14 కిలోమీటర్లు మేరకు పీఎంజియస్ నిధులు 8కోట్ల రూపాయలు తో గత ప్రభుత్వంలో మంజూరు చేసి పనులు ప్రారంభించి నేటి తో పూర్తి అయిన సందర్బంగా విజయనగరం జిల్లా వైస్సార్సీపీ ప్రచార విభాగం అధ్యక్షులు మరియు చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తను పని మీద మందిరవలస వెళ్లుతూ రోడ్డు పరిశీలిచారు చాలా బాగా వచ్చింది అని అన్నారు జి.అగ్రహారం ఊరిలోనుంచి పెద్ద వెహికల్స్ వెళ్ళ కుండా బైపాస్ రోడ్డు లా ఉపయోగ పడుతుంది అని అన్నారు గతంలో చీపురుపల్లి పట్టణం నుండి జి.అగ్రహరమీదగా గరివిడి మండలం, మెరకముడిదాం మండలం లో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేవారు అని ఆయా గ్రామంలకు వెళ్లేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు అని g.ఆగ్రహారం వచ్చేసరికి రోడ్డు ఇరుకుగా ఉండి పెద్ద లారీ లు గాని, బస్సు లు, ఇతర వెహికల్స్ వెళ్లేందుకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. మా నాయకులు పెద్దలు మాజీ విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, గారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారికి చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలు అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజెస్తున్నాం అని ఆన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తో పాటు మొండేటి శ్రీను, ప్రభాత్ కుమార్, పేకాపు ప్రసాద్, పొడిమిటివలన గణేష్, దన్నాన సత్యం వెంకీ, తదితరులు పాల్గొన్నారు